`సయ్యారా` చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ గా పాపులరయ్యారు అహాన్- అనీత్ పద్దా. తెరపై ఈ జంట కెమిస్ట్రీ అద్భతంగా వర్కవుటైంది. అయితే ఆఫ్ ద స్క్రీన్ ప్రేమలో ఉన్న కారణంగానే వెండితెరపై అంత బాగా కుదిరింది! అంటూ అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. కానీ దీనిని ఈ జంట అధికారికంగా ధృవీకరించలేదు.
సయ్యారా నిర్మాత ఆదిత్య చోప్రాకు సన్నిహిత వ్యక్తి ఒకరు ఈ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. అహాన్- అనీత్ పద్దా నిజ జీవితంలో రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని కొన్నాళ్ల పాటు రహస్యంగా దీనిని నడిపించాలనుకున్నారని తెలుస్తోంది. వారిది వినోద పరిశ్రమలో అత్యంత అందమైన ప్రేమకథలలో ఒకటి. సయ్యారా కోసం కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది సహజంగానే జరిగింది. ఆమె అమాయకురాలు.. పరిశ్రమలో అండదండలేవీ లేవు.
షూటింగ్ సమయంలో అతడు ఆమెను బాగా చూసుకున్నాడు. వారు పని చేస్తున్నప్పుడు దగ్గరయ్యారు. చివరికి, స్నేహం లోతైన ప్రేమగా మారింది. అనీత్-అహాన్ నిబద్ధతతో కూడిన సంబంధంలో ఉన్నారు అని నిర్మాత ఆదిత్య చోప్రా సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ కెరీర్ పై ఫోకస్ చేయడం వల్ల తమ డేటింగ్ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు.