బిగ్ బాస్ లోకి ఎన్నో హోప్స్ తో అడుగుపెట్టి అక్కడ తమ వ్యక్తిత్వాన్ని చూపించడం వలన బయట చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు కొంతమంది. వాళ్ళు సోషల్ మీడియా నెటిజెన్స్ నుంచి తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొని.. షో పూర్తయ్యి బయటికొచ్చాక కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి కూడా వెళ్లారు. గతంలో గీత మాధురి, వితిక, పునర్నవి, సిరి, దీప్తి సునయన ఇలా చాలామంది బిగ్ బాస్ వల్ల క్రేజ్ తెచ్చుకోకపోగా ఆ షో వల్ల వాళ్లకు చాలా ఎఫెక్ట్ అయ్యింది.
హౌస్ లో తమ ఆట, తమ బిహేవియర్ చూసి కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నారని చాలా సందర్భాల్లో చాలామంది మట్లాడారు. గత సీజన్ లో సోనియా ఆకులపై బయట ఎంతగా నెగిటివిటీ వచ్చిందో, దానిని పోగొట్టుకోవడానికి ఆమె ఎంతగా పోరాడిందో చూసారు. ఇప్పుడు క్రేజీ గ్లామర్ గర్ల్ గా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టిన రీతూ చౌదరికి బయట నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది.
మొదటి వారంలో రీతూ బాగానే కనిపించినా రెండో వారంలో ఆమె సంచాలక్ గా ఫెయిల్ అవడమే కాదు, టాస్క్ ల్లో రీతూ బిహేవియర్ చూసాక బుల్లితెర ఆడియన్స్ లో రీతూ చౌదరిపై నెగిటివిటి మొదలయ్యింది. ఆమె టాస్క్ ఎలా ఆడినా బిహేవియర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఆమె వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనేది ఆమె అభిమానుల కోరిక.