నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం ఎన్నడూ లేని విధంగా సాయి పల్లవి గ్లామర్ గా బికినీ వేసుకుని విదేశాల్లో చెల్లెలి తో కలిసి బీచ్ ఒడ్డున ఎంజాయ్ చెయ్యడమే. సాయి పల్లవి తన సిస్టర్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. అందుకు సంబందించిన ఫొటోస్ సాయిపల్లవి చెల్లెలు షేర్ చేసింది.
ఆ ఫొటోస్ లో సాయి పల్లవి పద్ధతిగానే ఉంది. కానీ సాయి పల్లవి బికినీ వేసినట్టుగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపించగానే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం షాకయ్యారు. సాయి పల్లవి ఏంటి, ఇలా బికినిలో కనిపించడం అంటూ రకరకాలుగా మట్లాడారు. బాలీవుడ్ వెళ్ళింది అక్కడి నీళ్లు వంటబట్టయంటూ కామెంట్స్ చేసారు.
అయితే సాయి పల్లవి బికినీ ఫొటోస్ ఫేక్, సాయి పల్లవి చెల్లెలు షేర్ చేసిన ఫొటోస్ ను AI లో మార్ఫ్ చేసి బికినిలో చూపించారు అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ మండి పడడమే కాదు, అసలు సాయి పల్లవి బికినీ ఫొటోస్ లో ఎంతమాత్రం నిజం లేదు అని సన్నిహితులు చెబుతూ ఇలాంటి చెత్త రాతలెందుకు రాస్తారో అంటూ వారు ఫైర్ అవుతున్నారు.