మలయాళంలో స్టార్ హీరోలైన దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో కస్టమ్స్ అధికారులు సోదాలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. కొచ్చిలోని దుల్కర్ సల్మాన్ నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అసలు దుల్కర్ ఇంటిపై ఇంత సడన్ గా కస్టమ్స్ దాడులు జరగడం వెనుక కారణం ఏమిటంటే..
భూటాన్ నుంచి 100 లగ్జరీ కార్లను.. దుల్కర్ అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కస్టమ్స్ అధికారులు దుల్కర్ కు సంబందించిన 30 చోట్ల సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
దుల్కర్ ఇళ్ళు, ఆఫీస్ లపైనే కాకుండా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ సోదాలు జరగడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.