టాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. గత కొన్ని సీజన్స్ కి వచ్చిన కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున పై తెగ విమర్శలు చేస్తున్నారు. తమ తప్పేమి లేకపోయినా హోస్ట్ నాగార్జున తిడుతున్నారని, ఆయన షో ఎపిసోడ్ చూడరు, బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ని ఫాలో అయిపోతారు, ఆయన అసలు హోస్ట్ గా పనికిరారు అంటూ నాగ్ ని సోషల్ మీడియా వేదికగా మాజీ కంటెస్టెంట్స్ ఆడేసుకుంటున్నాడు.
అంతేకాదు వీకెండ్ ఎపిసోడ్ లోను నాగార్జున హోస్ట్ గా డల్ గా కనిపిస్తున్నారనే విమర్శలకు నాగార్జున సీజన్ 9 కి చెక్ పెట్టేసారు. గత రెండు వారాలుగా నాగార్జున హుషారుగా హోస్ట్ చెయ్యడమే కాదు.. షో లో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా పర్టిక్యులర్ గా చూపిస్తూ తప్పు చేసిన కంటెస్టెంట్స్ విషయంలో చాలా హుందాగా పనిష్మెంట్ ఇస్తున్నారు.
వీకెండ్ ఎపిసోడ్స్ లో చాలా చక్కగా కంటెస్టెంట్స్ తప్పులను చూపించడమే కాదు దానిని సరిద్దుకునేలా నాగ్ సలహాలు ఇవ్వడంపై నెటిజెన్స్ నాగ్ ని ప్రత్యేకంగా ప్రసంశిస్తున్నారు. బయట వినిపించే కామెంట్స్ నే మీకు చెబుతున్నాను అంటూ కంటెస్టెంట్స్ ను అలర్ట్ చేస్తున్నారు.
అసలు ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ పై ఆడియన్స్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించలేదు కానీ.. నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఎక్కువగా క్రేజీగా మారడంతో బుల్లితెర ఆడియన్స్ మెల్లగా కనెక్ట్ అవుతున్నారు. చూద్దాం ఫైనల్ గా సీజన్ 9 ఫలితమేమిటి అనేది.