పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం సెప్టెంబర్ 25 అంటే గురువారం రిలీజ్ కాబోతుంది. రేపు బుధవారం రాత్రి నుంచే OG స్పెషల్ ప్రీమియర్స్ సందడి మొదలు కాబోతుంది. అయితే OG చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే. అంటే OG కి సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలకు OG మూవీ చూసే అదృష్టం లేదు.
విపరీతమైన అంచనాలు, దసరా హాలిడేస్, మరి పవన్ సినిమా చూడాలనుకునే పిల్లలు, పెద్దలు అందరూ OG చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ OG సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం కేవలం పెద్దవాళ్లకు మాత్రమే, ఈ చిత్రంలో అన్ని యాక్షన్ సీక్వెన్స్, నరకడం, చంపడం అంటే వయలెన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా దీనికి A సర్టిఫికెట్ ఇచ్చారు.
మరి హాలిడేస్ లో పిల్లను తీసుకుని పెద్ద వాళ్ళు సినిమాలకు వెళ్లానుకుంటారు. కానీ ఇప్పుడు OG పిల్లలు చూసేందుకు కుదరదు, దానితో పెద్దవాళ్లు వాళ్ళను వదిలి OG థియేటర్స్ కు వెళ్లే ఛాన్స్ లేదు. ఇది OG కలెక్షన్స్ పై ప్రభావం చూపించడం ఖాయమనే మాట వినబడుతుంది.