కొన్నాళ్లుగా టాలీవుడ్ లో కనిపించని, వినిపించని పేరు రాశి ఖన్నా. సౌత్ లో అవకాశాలు తగ్గడంతో హిందీ వెబ్ సీరీస్, సినిమాలు చేసుకుంటున్న రాశి ఖన్నా ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అయ్యింది. నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రాశి ఖన్నా ఆతర్వాత సిద్దు జొన్నలగడ్డ తో తెలుసు కదా చిత్రంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించింది.
తెలుసు కదా చిత్రం షూటింగ్ పూర్తి కావడమే కాదు అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ షూట్ కూడా రాశి ఖన్నా పూర్తి చేసేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ సందడి చేస్తుంది. తెలుసు కదా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ లుక్స్ తో హీటెక్కిస్తోంది.
తాజాగా రాశి ఖన్నా ఇన్స్టా పిక్స్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది బాసు. శారీ లో పద్దతిగా కనిపిస్తారు కానీ.. ఈ రేంజ్ లో అందాలు చూపిస్తారా అనేలా రాశి ఖన్నా లేటెస్ట్ శారీ లుక్ ఉంది. అసలు చీరకట్టులో ఇంత కత్తిలా రాశి ఖన్నా కనిపించడం మాత్రం ఆమె అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.