Advertisement
Google Ads BL

OG ట్రైల‌ర్‌పై సాయి దుర్గ తేజ్‌రివ్యూ


పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement
CJ Advs

మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది..నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్.. 

నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు.. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది..  ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే అని ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓజీ ట్రైలర్‌ అయితే.. సుజిత్ చేసిన కట్స్, పవన్ కళ్యాణ్‌ స్టైలీష్‌, స్వాగ్‌‌ను మరో యాంగిల్‌లో చూపించడం, ఇక తమన్ బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

 

 

Sai Durgha Tej Shares OG Trailer Review:

Firestorm Unleashed: Sai Durgha Tej Shares Electrifying OG Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs