కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతుంది. ఈరోజు సోమవారం ప్రభాస్ చేతుల మీదుగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ని విడుదల చేసారు. కాంతార ట్రైలర్ మొత్తం భారీ విజువల్స్ తో నిండిపోయింది. కాంతార లోకి అడుగుపెట్టాలంటే అంటూ రిషబ్ శెట్టి ఉగ్రరూపం చూపించారు.
అయితే కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వస్తుంది అనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంతో ఆత్రుత చూపించారు. కారణం రిషబ్ శెట్టి కాదు, అందులోని హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ కోసం. కాంతార లో రుక్మిణి వసంత్ రాజకుమారి గెటప్ లో చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది. రుక్మిణి లుక్స్, ఆమె కేరెక్టర్ అన్ని కాంతార లో చాలా హైలెట్ అవబోతున్నాయి అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.
రుక్మిణి వసంత్ కోసమే కాంతార లో భారీ యుద్ధమే జరగబోతుంది అని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దానికి 100 రేట్లు భారీగా ఉండబోతుంది అనేది ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.