పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం OG. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న OG చిత్రంపై ఎంత క్రేజ్ ఉందొ అనేది OG ప్రీమియర్స్ షో టికెట్లు హాట్ కేక్స్ లా కాదు కాదు లక్షల్లో అమ్ముడవుతున్నాయి. లక్షలు పెట్టి OG టికెట్లను పవన్ ఫ్యాన్స్ సొంతం చేసుకోవడమే కాదు ఆ డబ్బు ని జనసేన పార్టీ కోసం విరాళాలు ఇవ్వడం మాత్రం నిజంగా అభినందించాల్సిన విషయమే.
OG టికెట్స్ వేలంలో లక్షలు పలుకుతున్నాయి. ఆ డబ్బు ని చెక్కుల రూపంలో జనసేన పార్టీ కి అందజేస్తున్న అభిమాన సంఘాలు. ఇలా OG టికెట్స్ వేలంలో బెంగళూరు రూ. 3.61 లక్షలు, చెన్నై రూ. 1.72 లక్షలు, చిత్తూరు రూ. 1 లక్ష లను చెక్కుల రూపంలో ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పార్టీకి అందజేసినట్లుగా జనసేన పార్టీ ప్రకటించింది.
ఆదివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్, అట్లాంటా పీకే అడ్డా సభ్యులు పీ.నవీన్, ఏ.అవినాశ్, ఎం.నరసింహ, వివేకలహరి, టీ.వెంకటరమణ రూ. 3.61 లక్షలు చెక్కు రూపంలో, చెన్నై ఎస్.ఆర్.ఎం.డి. సవిత విట్ నుండి ఐ.కళ్యాణ్ బాబు, సంతోష్, రిశిక్ నాయుడు, భరత్ రూ. 1.72లక్షలు డిడి రూపంలో, చిత్తూరు నుండి లోచన్, ఎస్.పురుశోత్తం, వెంకటేశ్, దుర్గాప్రసాద్ రూ. 1 లక్ష డిడి రూపంలో నాగబాబు చేతుల మీదుగా జనసేనపార్టీకి అందజేశారు.
మరి OG రిలీజ్ వేళ జనసేన కు పార్టీ ఫండ్ మాత్రం లక్షల్లో చేరుతుంది.