ఇది నిజం.. నిన్న పవన్ కళ్యాణ్ LB స్టేడియానికి రాకపోయి ఉంటే.. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టర్ ప్లాప్ అయ్యేది. 25 న సినిమా రిలీజ్ పెట్టుకుని మేకర్స్ హడావిడిగా ఆదివారమ్ సాయంత్రం భారీ ఎత్తున నగరం నడిబొడ్డున LB స్టేడియం లో OG లైవ్ కాన్సెర్ట్ నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రంగా ఎండ కాసింది, దానితో వర్షం ఉండదు అనుకున్నారు.
కానీ నైట్ కల్లా వరుణదేవుడు ప్రతాపం చూపించాడు. OG ఈవెంట్ కోసం పవన్ ఫ్యాన్స్ కోకొల్లలుగా హాజరయ్యారు. LB స్టేడియం మొత్తం పవన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. కానీ వర్షం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ ఆ జోరు వర్షంలో నిలబడి అభిమానులను ఉత్తేజపరుస్తూ కత్తి పట్టుకుని OG లుక్ లో స్టయిల్ గా కనిపించి, మాట్లాడిన మాటలకు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయారు.
ఈవెంట్ అంత పోయిన సరే🫠 ….ఒక్కడే ఉండి ఆ కటానా తిప్పుతూ,15 నిమిషాలు స్పీచ్ ఇచ్చి, జపనీస్ డైలాగ్ లు చెప్పి ,శివమణి తో డప్పులు కొట్టించి, ట్రైలర్ ఏస్తారా వెయ్యరా అని మరీ ట్రైలర్ వేయించి, ఆ కొద్ది సేపట్లోనే అందరి గురించి ప్రస్తావించి ….కుండపోత వర్షం లో కూడా ఈవెంట్ ని లాక్కొచ్చాడు చూడు 🙇🏻😌🔥🔥🔥🔥Thats why they call him POWER STAR❤️ఆయన చేతిలో మైక్ ఇస్తే చాలు, ఆయన చూసుకుంటాడు 🙏This is what we call THE STAR POWER .The KING👑The REAL meaning of ONE MAN SHOW 🙇🏻(ఎక్కడికి పోతాడు లే లోపల ఉన్న జనసేనాని 😌భీకర వర్షం లో కూడా అర్ధ రాత్రి వేల రాష్ట్ర రాజకీయాలని మార్చేసిన రోజు మచ్చిపోయారా 😅) అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేసిన ట్వీట్లు ..
నిజమే పవన్ కళ్యాణ్ అలా రాకుండా, ఆయన వర్షం భయంతో వెళ్ళిపోయుంటే OG ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కాగా అట్టర్ ప్లాప్ అయ్యేది.