అనుష్క శెట్టి కొన్నేళ్లుగా మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉంటుంది. సినిమాల్లో నటిస్తుంది తప్ప పబ్లిక్ లోకి రావడమే లేదు. ఆమె రీసెంట్ గా నటించిన ఘాటి దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. అనుష్క ఘాటీ చిత్రం ఇలాంటి రిజల్ట్ తెచ్చుకోవడానికి ఆమె సినిమాని పబ్లిసిటీ చేయకపోవడమే అనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఘాటీ చిత్రంలో అనుష్క చాలా బరువుగానే కనిపించింది. అయితే ఘాటీ చిత్రానికి ముందుగా అసలు అనుష్క ని అనుకోలేదట. నిజానికి దర్శకుడు క్రిష్ మొదట ఈ సినిమాను అనుష్కతో చేయాలని అనుకోలేదట. నయనతార తో ఘాటీ చిత్రాన్ని చెయ్యాలని క్రిష్ కథ ను ప్రిపేర్ చేసుకున్నారట. నయనతారను కూడా సంప్రదించారట.
అయితే ఘాటీ కథ ని విన్న నయనతార యాక్షన్ ఎక్కువ ఉన్న ఈప్రాజెక్టు చేసేందుకు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో క్రిష్ అనుష్క ను సంప్రదించడం, క్రిష్ పై నమ్మకంతో అనుష్క ఘాటీ చేసేందుకు ఒప్పుకుందట. అలా నయనతార ఖాతాలో పడాల్సిన ఘాటీ డిజాస్టర్ అనుష్క ఖాతాలోకి చేరిందన్నమాట,.