పవన్ అభిమానులకు ఆయన ఫ్యాన్సే విజ్ఞప్తి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వారిలో వారే విజ్ఞప్తి చేసుకుంటున్నారు అంటే ఎందుకో తెలుసుగా.. OG మ్యానియా లో పది ఎక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకునే స్థితికి తెచ్చుకుంటారో అని వారి భయం. ఈరోజు ఆదివారం సాయంత్రం OG ప్రీ రిలీజ్ ఈవెంట్ LB స్టేడియం లో జరగబోతున్న విషయాన్ని మేకర్స్ లేట్ గా తెలియజేసినప్పటికి ఫ్యాన్స్ కోకొల్లలుగా హైదరాబాద్ కి వచ్చేసారు.
LB స్టేడియం లో OG ఈవెంట్ కోసం పవన్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి రావడమే కాదు ఎంట్రీ గేట్ దగ్గర తోసుకుంటూ కనిపించడం చూసిన వారు ప్లీజ్ అందరూ అర్ధం చేసుకోండి.. ఫ్యామిలీస్, ఇంకా పిల్లలు మాత్రం ఈ ఈవెంట్ కి రాకండి, కొట్టుకుని, తొక్కుకుంటూ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా చెయ్యకండిరా.. అసలే మనకు ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్స్ చాలా రేర్ గా జరుగుతున్నాయంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం LB స్టేడియం లోపల ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో బయట అంతకన్నా ఎక్కువే ఈవెంట్ కోసం లోపలి వెళ్ళేవాళ్ళలో కనిపించడమే కాదు LB స్టేడియం చుట్టుపక్కన ట్రాఫిక్ జామ్ తో ఆ ఈవెంట్ కి సంబంధం లేని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.