Advertisement
Google Ads BL

మోహన్‌లాల్‌ కి అవార్డు-మెగాస్టార్ స్పందన


మలయాళ చిత్రసీమకు చెందిన సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు మోహన్‌లాల్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, 

Advertisement
CJ Advs

నా ప్రియమైన లాలెట్టన్, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు" అంటూ పేర్కొన్నారు. అంతేకాక మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోని షేర్ చేశారు మెగాస్టార్.

 మోహన్‌లాల్‌తో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 23న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ను సైతం భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పురస్కారంతో సత్కరించబోతోంది.

Chiranjeevi heartfelt wishes to Mohanlal:

Chiranjeevi Congratulates Mohanlal on Dadasaheb Phalke Award
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs