పవన్ ఫ్యాన్స్ లో OG పై క్రేజ్ ఎంతుందో.. ప్రీమియర్ షోస్ టికెట్ అమ్మకాలు చూస్తే తెలుస్తుంది. ఏకంగా లక్షల్లో OG టికెట్లకు ఖర్చు పెడుతున్నారు. OG మ్యానియా పవన్ ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లో సైతం కనిపిస్తుంది. దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి.. మరోపక్క ప్రమోషన్స్ విషయంలో పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు.
ఈరోజు సాయంత్రం LB స్టేడియం లో OG ఈవెంట్ కి ప్లాన్ చేసారు. అయితే ఈరోజు ఉదయం OG ట్రైలర్ వదులుతామని మేకర్స్ ప్రకటించారు. కాని ఉదయం 10 నుంచి OG ట్రైలర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే దానిని వాయిదా వేశారు. అసలే OG ప్రమోషన్స్ లేక అల్లాడిపోతున్న ఫ్యాన్స్ కు OG ట్రైలర్ వాయిదా అనేది మంట పుట్టించింది.
అయితే OG ట్రైలర్ విడుదల వాయిదాకు కారణాలు.. అందులో రెండు కరెక్షన్స్ ఉన్నాయని అది పవన్ చెప్పడంతో వాటిని సరి చెయ్యడానికి సమయం కావాలి కాబట్టి ఈరోజు ఉదయం OG ట్రైలర్ విడుదల వాయిదా వేసి సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదలబోతున్నారని తెలుస్తుంది. దర్శకుడు సుజిత్ కి ప్రస్తుతం ఉన్న విపరీతమైన హైప్ OG కి సరిపోతుంది.
ఇక ట్రైలర్ ఎందుకు వదలడం అనే భావనలో ఉన్నాడని, కానీ ఆనవాయితీ ప్రకారమే ట్రైలర్ విడుదల చేస్తున్నారని అంటున్నారు. ఇక OG ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.