కొన్నాళ్లుగా సక్సెస్ లకు కేరాఫ్ గా మారిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు లేడీ షాకివ్వడం హాట్ టాపిక్ గా మారింది. రెండు వారాల క్రితమే మోహన్ లాల్ హృదయపూర్వం తో పాటుగా మలయాళంలో దుల్కర్ నిర్మించిన కళ్యాణి ప్రియదర్శి నటించిన కొత్త లోక విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది.
కొత్త లోక కి మలయాళంలోనే కాదు విడుదలైన ప్రతి భాషలోనూ మంచి ప్రసంశలు, అందుకు తగిన అదిరిపోయే కలెక్షన్స్ దక్కాయి. మరోపక్క మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ రికార్డులకు కేరాఫ్ గా కనిపిస్తారు. మోహన్ లాల్ ఈ ఏడాది ఎల్-2 ఎంపురాన్, తుడురం, హృదయపూర్వం అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే.
కానీ ఇప్పుడు మోహన్ లాల్ రికార్డులను కళ్యాణి ప్రియదర్శి కొత్త లోక చాప్టర్ 1 తుడిచేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు మోహన్ లాల్ రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే అనేది మోహన్ లాల్ కు లేడీ సూపర్ షాక్ అనేది.