బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్స్ vs సెలబ్రిటీస్ గా విభజించి ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేద్దామని యాజమాన్యం భావించింది. సెలబ్రిటీస్ ఎప్పుడో పాపులర్ అవడంతో కామన్ మ్యాన్స్ అగ్నిపరీక్షతో కష్టపడి హౌస్ లోకి రావడంతో వాళ్ళను ఓనర్స్ గా చేసి రాజభోగాలు అందించారు, కానీ సెలబ్రిటీస్ ని టెనెంట్స్ గా మార్చి కష్టపెట్టారు.
కామనర్స్ లో హరిత హరిష్, దమ్ము శ్రీజ, ప్రియా, మనీష్, పవన్ లు కాస్త రెచ్చిపోయి సెలబ్రిటీస్ కన్నా మేము తోపులు అనే రీతిలో బిహేవ్ చేసారు. ప్రియా-శ్రీజలకు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ పీకారు. అలాగే పవన్ కెప్టెన్సీ ని క్యాన్సిల్ చేసేసారు. కామన్ మ్యాన్స్ అతి చేస్తున్నారని వాళ్ళను టెనెంట్స్ గా మార్చి సెలబ్రిటీస్ ని ఓనర్స్ గా మార్చేసాడు నాగార్జున.
అంటే ఇప్పటివరకు కామనర్స్ ఓనర్స్ గా ఉంటే, సెలబ్రిటీస్ టెనెంట్స్ గా ఉన్నారు. ఇప్పుడు హౌస్ లో సీన్ రివర్స్ అన్నమాట. సెలబ్రిటీస్ ఓనర్స్ గాను, కామనర్స్ టెనెంట్స్ గా మారిపోయారు. ఇకపై ఆట ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ వారం కామన్ మ్యాన్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు.