బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా అక్కడి టాప్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తూ గ్లామర్ తో స్ట్రాంగ్ గా జెండా పాతిన రష్మిక మందన్న కు అక్కడి హీరోలు, దర్శకనిర్మాతలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. కొత్త సినిమాలేవి మొదలవుతున్నా అందులో హీరోయిన్ గా రష్మిక ఉందా అని చూస్తున్నారు. అంతగా రష్మిక పేరు బాలీవుడ్ లో మార్మోగిపోయింది.
ఇప్పటికే పలు హిందీ ప్రాజెక్ట్స్ లో, స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న రష్మిక మందన్న కు లక్కీ ఛాన్స్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా వార్ 2 తో డిజప్పాయింట్ చేసిన హృతిక్ రోషన్ అప్ కమింగ్ మూవీ క్రిష్ 4 లో రష్మిక మందన్నాను హీరోయిన్ గా అనుకుంటున్నారనే వార్త ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.
ఇప్పటికే రష్మిక మందన్న హీరోయిన్ గా క్రిష్ 4 లో ఫైనల్ అయ్యింది అని, త్వరలోనే ఈ క్రేజీ యూనివర్స్ లోకి రశ్మిక ఎంటర్ అవ్వబోతుంది అంటున్నారు. మరి ఈ లెక్కన ఏ బాలీవుడ్ హీరోను రష్మిక అదృష్టం వదిలిపెట్టేలా లేదుగా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.