బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం ఫినిష్ అవ్వబోతుంది. మొదటి వారంలో కామన్ మ్యాన్ ఓనర్స్ గాను, సెలబ్రిటీస్ టెన్నెట్స్ గాను గొడవలు పడ్డారు. ఆ వారం సంజన ని శ్రీజ దమ్ము పోరాడి ఆడి కెప్టెన్ ని చేసింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో రీతూ సంచాలక్ గా కావాలనే పవన్ ని కెప్టెన్ చెయ్యడానికి భరణి, ఇమ్మాన్యువల్ లని టాస్క్ లో అవుట్ చేసి పవన్ కి కెప్టెన్సీ ని కట్టబెట్టిన తీరు విమర్శలకు తావిచ్చింది.
అంతేకాదు టెన్నెట్స్ గా ఉన్నవారిలో ఒకరు ఓనర్ అయ్యేందుకు పెట్టిన టాస్క్ లోను రీతూ చాలా ఓవర్ చేసింది. ఆ టాస్క్ లో రీతూ వింతగా బిహేవ్ చేసింది. దానితో బయట రీతూ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. మొదటివారంలో చక్కగా ఉన్న రీతూ రెండో వారంలో పవన్ తో ట్రాక్ స్టార్ట్ చేసి ఆమె ఆటని ఆమె స్పాయిల్ చేసుకుంది.
ఇప్పుడు శనివారం ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఈవారం ఎవరికి క్లాస్ పీకుతారో అని ఎదురు చూస్తే పవన్ కెప్టెన్ అయిన తీరుని విమర్శిస్తూ రీతూ ని టార్గెట్ చేసిన నాగార్జున... వీడియోస్ వేసి చూపించడమే కాదు రీతూ వల్ల పవన్ కెప్టెన్సీని నాగ్ క్యాన్సిల్ చెయ్యడం ప్రోమోలో హైలెట్ అయ్యింది. దానితో హౌస్ మొత్తం షాకయ్యారు.