మోహన్ లాల్ హీరోగా రీసెంట్ గా మలయాళంలో విడుదలైన హృదయపూర్వం చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరి కన్ను పడింది.
ఆగస్టు 28న థియేటర్లలో విడుదలై ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. మరి థియేటర్స్ లో హృదయపూర్వం విడుదలై నెల రోజులు అవుతున్న సందర్భంగా ఈ సక్సెస్ ఫుల్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు జియో ప్లస్ హాట్ స్టార్ రెడీ అయ్యింది.
హృదయపూర్వ చిత్రాన్ని ఈ నెల 26 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీ లో చూసేందుకు రెడీ అయిపోండి.