వైసీపీ నుంచి నిన్న శుక్రవారమే ఓ వికెట్ డౌన్ అయ్యింది. వైసీపీ ఎమ్యెల్సీ టీడీపీ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్యెల్యే వైసీపీ పార్టీ ని వీడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అరకు MLA మత్స్యలింగం వైసీపీ పార్టీని వీడుతున్నారనే వార్త సామజిక మాధ్యమాల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.
తాను ఆ పార్టీని వీడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై MLA మత్స్యలింగం రియాక్ట్ అవడమే కాదు.. తను రాజకీయాలైనా వదిలేస్తాను కానీ.. వైసీపీ పార్టీ ని వీడే ప్రసక్తే లేదు అంటూ తెగేసి చెప్పారు. తన కట్టే కాలేవరకు తనే కాదు తన ఫ్యామిలీ కూడా జగన్‌తోనే ప్రయాణం చేస్తుంది అంటూ మత్స్యలింగం క్లారిటీ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తను వైసీపీ పార్టీకి జగన్ కు తను ద్రోహం చేసేది లేదు, ప్రాణం పోయేవరకు తను వైసీపీ పార్టీ లోనే ఉంటానని చెప్పారు.