మరో ఐదు రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన OG విడుదల కాబోతుంది. ఇప్పటివరకు ప్రోపర్ గా OG ప్రమోషన్స్ మొదలు కాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన చాలా ఉంది. బయట చూస్తే OG క్రేజ్ మాములుగా లేదు.. లక్షలు పెట్టి మరీ OG ప్రిమియర్ షో టికెట్స్ కొనేస్తున్నారు అభిమానులు.
ఇక పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి OG ని ప్రమోట్ చేస్తే ఈ అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం అన్నట్టుగా దానయ్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చారు. సోషల్ మీడియాలో ఎంతగా సినిమాని ప్రమోట్ చేసినా.. పవన్ వస్తే ఆ క్రేజ్ వేరు.
పవన్ కళ్యాణ్ ని ఎప్పటినుంచో OG అడుగుతున్నారు. ఇక రేపు OG ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు. ఇప్పటికి అధికారిక ప్రకటన లేదు. రేపు సాయంత్రం అంటే ఆదివారం వర్షం పడితే శిల్ప కళా వేదిక, లేదంటే LB స్టేడియం లో OG ఈవెంట్ కోసం పర్మిషన్స్ తెచ్చుకున్నారట. అది అధికారికంగా చెబితే ఫ్యాన్స్ అలర్ట్ అవుతారు. అదే వారి బాధ.
OG మేకర్స్ ఎందుకింత మౌనం అని. ఏదైనా పవన్ సపోర్ట్ లేకపోతె వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.