కాంతార చిత్రం కన్నడలో సూపర్ హిట్ అవడంతో రిషబ్ శెట్టి ఆ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేసారు. కాంతార విడుదలైన ప్రతి భాషలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. దానితో దానికి ప్రీక్వెల్ గా కాంతార 1 ని తెరకెక్కించారు. ఆ చిత్రం అక్టోబర్ 2 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
అయితే కాంతార చాప్టర్ 1 చిత్ర ప్రమోషన్స్ మాత్రం ఇంకా ఎక్కడా మొదలవ్వలేదు. రిషబ్ శెట్టి వావ్ అనే రేంజ్ లో కాంతార 1ని ప్రమోట్ చేస్తారని అందరూ ఊహించారు. కానీ విడుదలకు పట్టుమని పదిరోజులు లేదు.. ఇప్పటికీ పాన్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ అవలేదు. దానితో కాంతార ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
అయితే కాంతార పై ఉన్న క్రేజ్ కాంతార చాప్టర్ 1 కి సరిపోతుంది.. దానితో ప్రమోషన్స్ ఎలా ఉన్నా ఓకే ప్రేక్షకులు ఆటొమాటిక్ గా థియేటర్స్ కి వస్తారన్నట్టుగా కాంతార మేకర్స్ తీరు ఉంది. పది రోజుల్లో కాంతార చాప్టర్ 1రిలీజ్ ఉంది, ఈ పది రోజుల్లో పాన్ ఇండియా ప్రమోషన్స్ ని ఎలా చక్కబెడతారో చూడాలి.