Advertisement
Google Ads BL

స్టార్ హీరోని ప్రేమించిన న‌టి హార్ట్ బ్రేక్


త‌ళా అజిత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అత‌డి స్టైల్, న‌ట ప్ర‌తిభ‌కు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ముఖ్యంగా మ‌హిళా ఫ్యాన్స్ లో అత‌డి క్రేజ్  అసాధార‌ణ‌మైన‌ది. ఇక‌పోతే అజిత్ తో క‌లిసి రెండు సినిమాల్లో న‌టించిన మ‌హేశ్వ‌రి (శ్రీ‌దేవి బంధువు) అత‌డితో నిండా ప్రేమ‌లో మునిగాన‌ని చెప్పింది. తాజాగా జ‌గ‌ప‌తిబాబు హోస్ట్ చేస్తున్న `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` కార్య‌క్ర‌మంలో సిమ్ర‌న్, మీనాల‌తో పాటు క‌నిపించిన మ‌హేశ్వ‌రి `స‌హ‌న‌టుల‌పై క్ర‌ష్` గురించి ప్ర‌శ్నించ‌గా, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది.

Advertisement
CJ Advs

తాను అజిత్ కి వీరాభిమానిని అని, అత‌డంటే ప‌డి చ‌స్తాన‌ని చెప్పింది మ‌హేశ్వ‌రి. అత‌డితో క‌లిసి రెండు సినిమాల్లో నటించాను. సుదీర్ఘ కాలం ప్ర‌యాణించ‌డంతో అత‌డిపై లవ్ పెరిగింద‌ని హ‌హేశ్వ‌రి చెప్పింది. అయితే షూటింగ్ చివ‌రి రోజున అజిత్ త‌న‌కు ఊహించ‌ని షాకిచ్చార‌ని వెల్ల‌డించింది. అత‌డు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నువ్వు నా చెల్లిలాంటిదానివి. ఏదైనా సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌ప్ప‌కుండా సంప్ర‌దించు! అని చెప్పి వెళ్లిపోయార‌ట‌. ఆ మాట‌ల‌కు అప్పుడే గుండె ముక్క‌లైపోయింద‌ని మ‌హేశ్వ‌రి గుర్తు చేసుకుంది. 

మొత్తానికి మ‌హేశ్వ‌రిని ఎంత‌గానో ప్రేమించిన ఇత‌ర హీరోల‌కు కూడా గుండె ముక్క‌లైన ఎపిసోడ్లు ఉన్నాయి. అప్ప‌ట్లో జేడీ చక్ర‌వ‌ర్తి కూడా మ‌హేశ్వ‌రి అంటే చాలా ఇదైపోయావాడ‌ని గుస‌గుస‌లు ఉన్నాయి. కానీ చివ‌రికి ఆ ఇద్ద‌రూ కూడా దూర‌మ‌య్యారు. మ‌హేశ్వ‌రి ఆ త‌ర్వాత ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు. ఇటీవ‌ల టీవీ కార్య‌క్ర‌మాల‌తో మ‌ళ్లీ అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌స్తున్నారు. త‌ళా అజిత్ త‌న స‌హ‌న‌టి షాలినిని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

Maheswari Says She Was Heartbroken When Ajith Kumar:

Sridevi niece Maheswari opens up about crushing on Ajith Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs