టీడీపీ పార్టీ తో రాజకీయాలు మొదలు పెట్టి ఆ తర్వాత టీడీపీ నుంచి జగన్ పార్టీ వైసీపీ కి జంప్ అయ్యి ఆ పార్టీలో కన్నుమిన్ను కానక చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. కొడాలి నాని సావాసంతో, జగన్ అండతో రెచ్చిపోయిన వల్లభనేని వంశి గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన ఈకేసులో ముద్దాయిగా మారాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరెస్ట్ భయంతో ఎక్కడున్నాడో ఎవ్వరికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన వల్లభనేని ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తరవాత పలు కేసుల్లో బెయిల్ రాక కొన్ని నెలల పాటు జైల్లోనే ఉన్న వంశి ని అనారోగ్యం వెంటాడింది.
ఫైనల్ గా జైలు నుంచి విడుదలయ్యాక సైలెంట్ గా ఇంట్లోనే ఉంటున్న వల్లభనేని వంశి ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. కొంతమంది టీడీపీ అభిమానులు..
టీడీపీ ని వీడి జగన్ పార్టీలో చేరి జగన్ రెడ్డి మెప్పు కోసం హద్దు మీరి ప్రవర్తించి రాజకీయాలలో ఎంతో మంచి భవిష్యత్ ఉన్న వంశీ కేవలం నోరు అదుపులేని తనంతో, అహంకారంతో అర్ధాంతరంగా రాజకీయాల నుండి తప్పు కోవడం.. ఒక గుణపాఠం.. దుష్టులతో చెయ్యి కలిపి అన్నం పెట్టిన చేతులనే కరవాలని చూస్తే .. పెట్టిన చెత్తోనే పాత చెప్పుతో కొడతారు... ఇందుకు వల్లభనేని వంశీ ఒక మంచి ఉదాహరణ అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.