వార్ 2 తర్వాత సైలెంట్ గా ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రీసెంట్ గా జిమ్ లో సూపర్ మేకోవర్ అవుతున్న వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నీల్ తో డ్రాగన్ షూటింగ్ లో ఉన్నారు అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ కి హైదరాబాద్ లో ప్రమాదం జరగడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది.
అయితే డ్రాగన్ షూటింగ్ లో కాకుండా హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనగా అక్కడ ప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు తగిలిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్ కి షూటింగ్ లో యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది. ఈరోజు ఒక ప్రకటన షూటింగ్ సమయంలో ఎన్‌టీఆర్ గారు స్వల్ప గాయానికి గురయ్యారు. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
అయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ హామీ ఇస్తున్నాం. అభిమానులు, మీడియా, ప్రజలందరూ ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా సహకరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం.