కల్కి 2 నుంచి దీపికా పదుకొనె ని తప్పిస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీపికా పదుకొనె పెట్టిన కండిషన్స్ వలనే ఆమెను ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి లో కీలకంగా కనిపించిన దీపికా ను సెకండ్ పార్ట్ నుంచి తప్పించడంతో ఆమె పాత్ర ను ఎవరితో చేయిస్తే ఆ పాత్రకు అంత వెయిట్ వస్తుంది అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ దీపికా ను కల్కి 2 నుంచి తప్పించారని ప్రకటన వచ్చిన కొద్ధిగంటలకే కర్మను ఎవరు తప్పించలేరంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే కల్కి 2 లో దీపికా పదుకొనె స్థానంలో చాలామంది హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి.
ప్రభాస్ సరసన దీపికా స్థానంలో రష్మిక మందన్నా వస్తుంది అని కొందరు, మరికొందరు దీపికా పదుకొనె స్థానంలోకి ప్రియాంక చోప్రా అయితే కల్కి సీక్వెల్ కి మైలేజ్ వస్తుంది. గ్లోబల్ వైడ్ గా కల్కి 2 కి క్రేజ్ వస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వైజయంతి మూవీస్ కి సలహాలు ఇస్తున్నారు.