వైసీపీ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు చాలామంది జైలుపాలయ్యారు. లిక్కర్ స్కామ్ లో బెయిల్ రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలోనే వైసీపీ కి బిగ్ షాకిచ్చారు వైసీపీ ఎమ్యెల్సీ మర్రి రాజశేఖర్.
2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణమైన ఓటమి తర్వాత చాలామంది నేతలు వైసీపీ ని వదిలి టీడీపీ అలాగే కొంతమంది జనసేన పార్టీలో చేరిపోయారు. అందులో ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ, ఎంపీ లు కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్యెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ ని వీడేందుకు ఎప్పటి నుంచో సుముఖంగా ఉన్నారు.
కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలను దూరంగా ఉంటున్న మర్రి రాజశేఖర్ నేడు టీడీపీ లో చేరేందుకు రెడీ అయ్యారు. చిలకలూరిపేటలో కొన్నాళ్లుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజశేఖర్.. ఈరోజు శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మరి ఇది జగన్ కి పెద్ద షాకే.