హీరో శర్వానంద్ రెండేళ్ల క్రితమే తాను ప్రేమించిన అమ్మాయి రక్షిత ని వివాహం చేసుకున్నాడు. పెళ్లి సింపుల్ గా చేసుకున్నా వెడ్డింగ్ రిసెప్షన్ ని చాలా గ్రాండ్ గా చేసుకుని అందరికి విందు ఇచ్చాడు. రక్షిత అమెరికా లో జాబ్ చేస్తుంది. పెళ్లి తర్వాత శర్వా కూడా అమెరికాలో అలాగే హైదరాబాద్ అంటూ తిరుగుతున్నాడు.
ప్రస్తుతం నారి నారి నడుముమురారి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే శర్వానంద్-రక్షిత దంపతులకు ఓ పాప కూడా జన్మించింది. ఇప్పుడు శర్వా తన భార్య తో సపరేట్ గా ఉంటున్నాడు అనే వార్త మీడియాలో వైరల్ గా మారింది, విడాకులు కోసం వెళ్లకపోయినా.. ఈ జంట నడుమ మనస్పర్థలు రావడంతో సైలెంట్ గా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారని తెలుస్తుంది.
శర్వా పెద్దలు, రక్షిత పెద్దలు వారిద్దరి మద్యన ప్యాచప్ చేసేందుకు తిప్పలు పడుతున్నారని, కానీ వారిరువురు కలిసేందుకు సుముఖంగా లేరు అని సమాచారం. కానీ వారిద్దరూ కలిసి ఉండాలని విడిపోకూడదు అని శర్వా అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.