బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. కారణం ఆమె రెండు పాన్ ఇండియా మూవీస్ నుంచి తప్పుకోవడం కాదు తప్పించడంతో దీపికా పదుకొనె ఇప్పుడు వైరల్ గా మారింది. సందీప్ వంగ స్పిరిట్ కోసం దీపికా పదుకొనె ను హీరోయిన్ గా ఎంపిక చేసి ఆ తర్వాత ఆమె డిమాండ్స్, అలాగే కమిట్మెంట్ లేదు అన్న కారణంగా స్పిరిట్ నుంచి తప్పించడంతో పెద్ద సెన్సేషన్ అయ్యింది.
ఇప్పుడు ప్రభాస్ మరో మూవీ కల్కి 2 నుంచి దీపికా పదుకొనె ను తప్పించడం హాట్ టాపిక్ కాదు ప్రభాస్ సినిమాల నుంచే దీపికా ను ఎందుకు తప్పిస్తున్నారో అనే విషయంలో అనేకరకాల అనుమానాలు మొదలయ్యాయి. కమిట్మెంట్ లేకపోవడం వలనే దీపికా ను కల్కి 2 నుంచి మేకర్స్ తప్పించారా, లేదంటే ప్రభాస్ వద్దన్నారా అనే విషయం క్లారిటీ రావాల్సింది.
మరోపక్క ప్రభాస్ వద్దంటే అల్లు అర్జున్-అట్లీ ఓకే చేసారు.. అల్లు అర్జున్ కి ఓకే అయితే ప్రభాస్ కి నాట్ ఓకే ఇదెలా అంటూ దీపికా పదుకొనె విషయంలో చాలామంది దీర్ఘాలు తీస్తున్నారు. ఏది ఏమైనా దీపిక పదుకొనే ను భారీ సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి తప్పించడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.