సమంత కొద్దిరోజులుగా సినిమాలకు బ్రేకిచ్చేసి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాదు సక్సెస్ అంటే సినిమాలు చెయ్యడం కాదు, టాప్ 10 జాబితాలో ఉండడము కాదు, సక్సెస్ అంటే ఆరోగ్యం.. ఆరోగ్యం గా ఉంటే ఏదైనా చెయ్యగలం అంటూ సమంత ఈమధ్యన లైఫ్ లెసన్ మాట్లాడుతుంది.
తాజాగా మరోసారి సమంత ఇలాంటి నీతి సూక్తులు చెబుతుంది. హీరోయిన్, అలాగే కెరీర్, గ్లామర్, బ్యూటీ, పాపులారిటీ ఇలా ఏది శాశ్వతం కాదు. ఏదైనా కొంత కాలమే, ఒక నటిగా ఎదగడానికి అదృష్టానికి మించి చాలా కావాలని, తాను లైఫ్ లో నటిగా కంటే ఇంకా పెద్ద గా ఏదైనా సాధించాలని కోరుకుంటున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది.
అంతేకాదు దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటూ సమంత మరోమారు జీవిత పాఠాలను వల్లెవేస్తుంది. ప్రస్తుతం సమంత నటనకు బ్రేకిచ్చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది.