మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా తెరకెక్కిన కొత్త లోక చిత్రం మళయాళంలోనే కాదు, విడుదలైన పాన్ ఇండియా భాషల్లోను సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్లో తెరకెక్కిన కొత్త లోక మొట్టమొదటి సూపర్ ఉమన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 250 కోట్లు కొల్లకొట్టింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీ 250 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడమనేది మాములు విషయం కాదు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన కొత్త లోక చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆడియన్స్ కన్నేశారు. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
కొత్త లోక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈచిత్రాన్ని సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ డేట్ పై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.