పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్. కల్కి చిత్రంతోనే దీపిక పదుకొనె సౌత్ కి ఎంటర్ అయ్యింది. కల్కి సూపర్ హిట్ అయ్యింది. కల్కి కి సీక్వెల్ గా కల్కి 2 రావాల్సి ఉంది. ఇతరత్రా అంటే ప్రభాస్ డేట్స్ కారణంగా కల్కి 2 షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది.
ఈలోపే కల్కి 2 నుంచి దీపికా పదుకొనె ను తప్పించినట్లుగా వార్తలు రావడం, ఇప్పుడు కల్కి 2 మేకర్స్ అదే విషయాన్ని అనౌన్స్ చేసారు. కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు స్వయంగా కల్కి పార్ట్ 2 లో దీపికా పదుకోనె ఎలాంటి భాగం కాదని సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేస్తూ ప్రకటించడం అందరికి షాకిచ్చింది.
కల్కి 2898 AD లాంటి చిత్రానికి మరింత కమిట్మెంట్ కావాల్సి ఉంటుందని అందుకే తమ దారులు వేరైనట్టుగా ప్రకటించారు. మరి దీపికా ను సందీప్ వంగ స్పిరిట్ నుంచి తప్పించడం, ఆతర్వాత మళ్లీ ఇన్నాళ్ళకి ప్రభాస్ కల్కి 2 నుంచి కూడా దీపికా ను తప్పించడం వెనుక అనేకరకాల అనుమానాలను నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.