పాన్ ఇండియా మూవీ అంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి. ఆర్.ఆర్.ఆర్ తో దానయ్య ఇండియా మొత్తం ఎలా తిరిగారు. ఎన్ని చోట్ల ప్రమోషన్స్ చేసారు. ఇప్పుడు దానయ్య OG విషయాన్ని ఎలా లైట్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రానికి పాన్ ఇండియా నటులను తీసుకురావడం కాదు అందుకు తగ్గ ప్రమోషన్స్ చేస్తేనే టికెట్స్ తెగుతాయి.. ఇది పవన్ ఫ్యాన్స్ వెర్షన్.
ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటే ఎలా ఉంటున్నాయి. సినిమాలను ఎంతగా ప్రమోట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. కానీ సుజిత్ ఇంకా ఇంకా OG ని చెక్కుతూనే ఉన్నాడు. సినిమా విడుదలకు పట్టుమని వారం రోజులు లేదు. కానీ ప్రమోషన్స్ జాడ లేదు. ప్రియాంక మోహన్ ఇంటర్వ్యూ, అర్జున్ దాస్ ట్వీట్లు సరిపోతాయా..
OG పెద్ద ఈవెంట్ ప్లాన్ చెయ్యండి. పవన్ కళ్యాణ్ ను ముంబై, చెన్నై అలా తీసుకెళ్లండి, అప్పుడే OG క్రేజ్ పెరుగుతుంది అంటూ పవన్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఏపీలో ఈవెంట్ అన్నారు, ఇప్పడు హైదరాబాద్ అంటున్నారు, అదేదో తేల్చి అనౌన్స్ చెయ్యండి అంటూ పవన్ ఫ్యాన్స్ OG మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.