కొన్ని వ్యాఖ్యలు గుంభనగా ఉంటాయి.. అనుమానాలు రేకెత్తిస్తాయి! అలాంటి వ్యాఖ్యతో ఆశ్చర్యపరిచింది క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ. ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ కపుల్ గా చాహల్-ధనశ్రీ రికార్డులకెక్కారు. ఈ జంట విడాకుల వ్యవహారం అభిమానులను కలవరపరిచింది. అసలు చాహల్ నుంచి విడిపోవడానికి కారణమేమిటి? భర్తను మోసం చేసారట కదా? అని ప్రశ్నిస్తే ధనశ్రీ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు.
రియాలిటీ `షో రైజ్ అండ్ ఫాల్` లో ధనశ్రీ తన మాజీ భర్త గురించి ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన జవాబిచ్చారు. నాపై వారు ఇలాంటి చెత్త ప్రచారం చేస్తున్నారు. నేను నోరు తెరుస్తానని అసలు విషయం తెలిసిపోతుందని అతడు భయపడుతున్నాడు. అందుకే ఈ ప్రచారం! అని ధనశ్రీ అన్నారు. ఇదంతా నా నోరు మూయించడానికి చేస్తున్నాడు. ఏం జరిగిందో నిజమైన వివరాలు మీకు చెబితే ఆశ్చర్యపోతారు! అంటూ ధనశ్రీ వ్యాఖ్యానించింది. విడాకుల కబుర్లు ఎక్కువైపోయాయి.
అసలు దీని గురించి మాట్లాడటమే వ్యర్థం. నేను దానిపై మాట్లాడను... అని కూడా అన్నారు. అయితే చాహల్ గురించి ధనశ్రీ ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారు. అదేమిటి? అంటూ ఇప్పుడు నెటిజనులు ఆరా తీస్తున్నారు. చాహల్ నుంచి బ్రేకప్ అయ్యాక ధనశ్రీ పూర్తిగా సినీకెరీర్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ గా, నటిగా వరుస అవకాశాలు అందుకుంటున్నారు ఈ ప్రతిభావని. ధనశ్రీ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న డ్యాన్స్ బేస్డ్ తెలుగు సినిమాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే.