అక్కినేని ఇంటి కోడలిగా నాగ చైతన్య కు భార్య గా నాగార్జున ఇంట అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల పెళ్లి తర్వాత అక్కినేని లెగసీని ముందుకు తీసుకువెలుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్, అలాగే ఫెస్టివల్స్ సమయంలో శోభిత సాధారణ గృహిణిలా చీరకట్టులో పద్దతిగా కనిపిస్తుంది.
ప్రొఫెషనల్ గా ఎంత గ్లామర్ చూపించినా ఇంటి వేడుకల్లో మాత్రం చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ఇక ఎక్కువగా ఆమె డివోషనల్ ట్రిప్స్ వేస్తుంది. రీసెంట్ గా తమిళనాడు లోని పలు దేవాలయాలను చుట్టేసింది. తాజాగా శోభిత దూళిపాళ్ల సాగర తీరంలో ఛిల్ అవుతూ కనిపించింది.
సముద్ర అలల నడుమ చిలిపిగా కనిపించిన శోభిత బ్లూ శారీ లో చాలా చక్కగా బ్యూటిఫుల్ లుక్స్ లో అభిమానులను మెస్మరైజ్ చేసింది. సాగర తీరాన అక్కినేని నాగార్జున పెద్ద కోడలు అలా అల్లరి చెయ్యడం చూసిన వారు చైతూని ఏం చేసావ్ శోభిత అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.