నార్త్ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ సౌత్ లో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. నార్త్ లో బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే దానికి వెళ్లేందుకు చాలామంది సెలబ్రిటీస్ మొగ్గు చూపుతున్నారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లో సక్సెస్ ఫుల్ గా సీజన్ 19 వరకు నడిపిస్తున్నారు. కానీ తెలుగు, తమిళ, కన్నడ ఇలా బిగ్ బాస్ సీజన్స్ లో హోస్ట్ లు మాత్రం మారిపోతున్నారు.
ప్రస్తుతం తెలుగులో నాగార్జున బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్నారు. తాజాగా మాజీ హీరోయిన్ బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు చేసింది. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినా ఆ షోలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆమె చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ మాజీ హీరోయిన్ ఎవరో కాదు తనుశ్రీ దత్తా.
తనుశ్రీ దత్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడే కాదు, నా లైఫ్ లో నేను ఎప్పటికీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లను. ఎవరు వచ్చి ఎంత చెప్పినా, ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా, ఆకాశంలోని చందమామను తీసుకొచ్చి ఇస్తామన్నా బిగ్ బాస్ పై నా నిర్ణయం మారదు, ఒక రియాలిటీ కోసం ఎవరో తెలియని వ్యక్తి పక్కన ఒకే మంచంపై పడుకోవాలా...
నేనంత మరీ అంత చీప్ కాదు. బిగ్ బాస్ అంటే ఒకే గదిలో ఆడ, మగ కలిసి ఉండటం, ఒకే బెడ్‌పై పడుకోవడం జరుగుతుంది. నాకు అలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. నాకంటూ కొన్ని రూల్స్ అలాగే ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అవి నేను మార్చుకోలేను అంటూ తనుశ్రీ దత్తా బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.