మిరాయ్ ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తున్న సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ చిత్రం గత శుక్రవారం విడుదలై అద్భుతమైన మౌత్ టాక్ తో అదిరిపోయే హిట్ అందుకుంది. మిరాయ్ కలెక్షన్స్ 100 కోట్లు చేరువలోకి రావడంతో నిర్మాతలు మిరాయ్ సక్సెస్ మీట్ ని విజయవాడలో నిర్వహించారు.
మిరాయ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ తనకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన హీరో తేజ సజ్జా కు, అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి లగ్జరీ కారు గిప్ట్ గా ఇస్తానని ప్రకటించారు. మరి తమకు హిట్ ఇచ్చిన దర్శకులకు నిర్మాతలు గిఫ్ట్ లు ఇవ్వడమనేది సర్వాధారణమే..
అయినప్పటికి తనకి ఇంత మంచి హిట్ ఇచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడం ఎప్పుడు స్పెషల్ అనే చెప్పాలి. మరి నిర్మాత టిజి విశ్వప్రసాద్ కి మిరాయ్ తో ఎంతగా లాభాలు రాకపోతే ఇలాంటి లగ్జరీ గిఫ్ట్ లు ప్రకటిస్తారంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.