హిందీ, మరాఠీ చిత్రాలలో నటించిన హూమా ఖురేషి తమిళంలో రజనీకాంత్ సరసన `కాలా` చిత్రంలో నటించింది. `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్`తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆరంగేట్రమే అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరిగా వెలిగిపోతోంది. ప్రస్తుతం యష్ `టాక్సిక్`లో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. జాలీ ఎల్.ఎల్.బి 3 - పూజా మేరీ జాన్ లాంటి క్రేజీ చిత్రాల్లోను నటించింది.
ఓవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న హూమా వ్యక్తిగత జీవితం పైనా నిరంతరం బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. తాజా సమాచారం మేరకు తన బోయ్ ఫ్రెండ్‌తో హూమా నిశ్చితార్థం చేసుకుందని కథనాలొస్తున్నాయి. హూమా ఖురేషి తన బోయ్ ఫ్రెండ్, నటశిక్షకుడు రచిత్ సింగ్ ని పెళ్లాడబోతోంది. అమెరికాలో ఓ వేడుకలో హూమాకు తన స్నేహితుడు రచిత్ ప్రపోజ్ చేసాడు. దీనికి ఈ భామ సంతోషంగా అంగీకరించిందని కథనాలొస్తున్నాయి. ఈ జోడీ ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉంది.
తన స్నేహితురాలు సోనాక్షి, ప్రియుడు జహీర్ ని పెళ్లాడినప్పుడు ఆ ఈవెంట్లో తన ప్రేమికుడితో కలిసి కనిపించింది. బాలీవుడ్ సహనటుల్లో ఒకరు ఈ జంటపై చేసిన సోషల్ మీడియా పోస్ట్ తో గుసగుసలు మొదలయ్యాయి. అయితే హూమా కానీ, తన ప్రియుడు కానీ నిశ్చితార్థం గురించి అధికారికంగా వెల్లడించలేదు. రచిత్ బాలీవుడ్ లో పలువురు ప్రముఖ తారలకు నటనలో శిక్షణనిచ్చారు.