పవన్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది.. OG కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుతున్నారో అందరికి తెలుసు. OG నుంచి ప్రోపర్ ప్రమోషన్స్ మొదలు కాకపోయినా.. OG నుంచి అప్ డేట్ ఏది వచ్చినా క్షణాల్లో దానిని పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దసరా స్పెషల్ గా ఈ నెల 25 న OG విడుదల కాబోతుంది.
అయితే OG చిత్రానికి ప్రీమియర్స్ ఉంటాయా, ఆ సినిమాకి టికెట్ రేట్లు పెరుగుతాయా అనే విషయంలో చాలామంది క్యూరియాసిటీతో కనబడుతున్నారు. అయితే OG విడుదలకు ఒకేరోజు ముందు మేకర్స్ ప్రీమియర్స్ వెయ్యడం లేదట. హరి హర వీరమల్లు లా అవుతుందేమో అని మేకర్స్ భయమేమో.. ఈ వార్త విని పవన్ ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు.
25 తెల్లవారు ఝాము అంటే 1 గంట నుంచి OG బెన్ఫిట్ షోస్ మొదలవుతాయని, 1 గంటకు అలాగే 4 గంటలకు OG స్పెషల్ షోస్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం OG మూవీ ఓవర్సీస్ బుకింగ్స్ లో రికార్డులను తిరగరాస్తుంది. ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాల్లో OG బుకింగ్స్ మొదలవుతాయా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.