జాన్వీ కపూర్ అందాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ సోషల్ మీడియా లుక్స్ పై యూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. జాన్వీ కపూర్ కూడా యూత్ కి ఎలా ఉంటే నచ్చుతుందో అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని అందాలు ఆరబోసే డ్రెస్సులతో దిగిపోతుంది.
హిట్టు-ప్లాప్ లు అంటూ రిజల్ట్ తో పని లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కి రీసెంట్ గా పరం సుందరి పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు మరో హిందీ మూవీ తో అదృష్టాన్ని పరీక్షించేందుకు రెడీ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ తో కలిసి జాన్వీ కపూర్ గ్లామర్ గా మీడియా ముందుకు వస్తుంది.
తాజాగా పింక్ డ్రెస్ లో జాన్వీ కపూర్ మిరిమిట్లు గొలిపేలా చాలా స్టయిల్ గా కనిపించింది. పింక్ మోడ్రెన్ వేర్ లో జాన్వీ కపూర్ స్టయిల్ గా డాన్స్ చేస్తూ కనిపించింది. జాన్వీ కపూర్ పింక్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.