పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చెయ్యడానికి చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన లిస్ట్ లో రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 తో పాటుగా హను తో మరో సినిమా కమిట్మెంట్, ఈ మధ్యలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో సినిమా ఇలా ప్రభాస్ నిమిషం తీరికలేని లైనప్ తో ఉన్నారు.
హనుమాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని రిషబ్ శెట్టి తో ప్లాన్ చెయ్యడమే కాదు ఫస్ట్ లుక్ వదిలి కామ్ అయ్యారు, మరోపక్క బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత ఎత్తుకుని వదిలేసారు. అప్పటినుంచి అంటే గత ఏడాది నుంచి సైలెంట్ గా ఉంటున్న ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చెయ్యబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యారట.
ప్రీ ప్రొడక్షన్ కాదు ప్రీ విజువైలేషన్ పూర్తి చేసాడు అని, ఆ సినిమాలో ప్రతీ క్యారెక్టర్, ప్రతీ సీన్, ప్రతీ షాట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారట ప్రశాంత్ వర్మ. అంత పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది అని, త్వరలోనే షూటింగ్ మొదలు కావొచ్చు అని చెప్పడమే కాదు ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీకి బ్రహ్మరాక్షస్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం యమా జోరుగా సాగుతుంది.