బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఏకంగా ఆరుగురు కామన్ మ్యాన్స్ అడుగుపెట్టారు. ఈసారి సెలబ్రిటీస్ నుంచి పెద్దగా బిగ్ బాస్ పై ఆసక్తి చూపకపోవడంతో బిగ్ బాస్ యాజమాన్యం కామన్ మ్యాన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు కామన్ మ్యాన్స్ అగ్నిపరీక్ష అంటూ పోటీపడి మరీ ఆరుగురు హౌస్లోకి వచ్చారు.
అందులో కామనర్స్ ని ఓనర్స్ గాను, సెలబ్రిటీస్ ని టెన్నెట్స్ గాను బిగ్ బాస్ విభజించడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. మాస్క్ మ్యాన్ హరీష్ అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీస్ తో విభేదిస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్ లో హరీష్ చేసిన తప్పులను నాగార్జున వాయించి వదిలిపెట్టడం హరీష్ తీసుకోలేక ఫుడ్ తినడం మానేసి ఎక్కువ చేస్తున్నాడు.
ఎమన్నా అంటే నా భార్య, నా తండ్రి తినరు అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో హరిత హారిష్ ని కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు కామనర్స్ కూడా టార్గెట్ చేసి నామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అతను సింపతీ గేమ్ ఆడుతున్నడంటూ భరణి, రీతూ లాంటి వాళ్ళు మాత్రమే కాదు మిగతా హౌస్ మేట్స్ చాలామంది హరీష్ ని టార్గెట్ చేసారు.
ఆఖరికి కామనర్స్ కూడా హరీష్ ని టార్గెట్ చేస్తూ అతన్ని నామినేషన్స్ లో నించోబెట్టారు.