ఆగష్టు 14 న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కి భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూలి చిత్రం ప్రేక్షకులను అస్సలు ఇంప్రెస్స్ చెయ్యలేదు. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ రోల్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవగా మిగత ఏది కూలి నుంచి ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ లేకపోవడం, అనిరుధ్ BGM కూడా సో సో గా ఉండడం వంటి అంశాలతో కూలి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
స్టార్ హీరోలను పెట్టి మాయ చేద్దామనుకున్న లోకేష్ కనగరాజ్ కి ఆడియన్స్ షాకిచ్చారు. థియేటర్స్ లో ఇంప్రెస్స్ చెయ్యకపోయిన కూలి ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు నెల తిరగకుండానే అంటే ఆగష్టు 14 న థియేటర్స్ లో విడుదలైన కూలి ని సెప్టెంబర్ 11 న ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. కూలి చిత్రం థియేటర్స్ లో నచ్చకపోయినా ఓటీటీ లో ఇంప్రెస్స్ చేస్తుంది అనుకున్నారు.
కానీ కూలి చిత్రం ఓటీటీ లో అంతగా సౌండ్ చెయ్యడం లేదు. కూలి చూసాక రజినీకాంత్, మిగతా స్టార్స్ ని పక్కనపెడితే శృతి హాసన్ తెలుగు చూడలేక చచ్చాం అంటున్నారు ఆడియన్స్. అంతేకాదు.. లోకేష్ కనగరాజ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూలి ఓటీటీ లో కూడా సౌండ్ చేయకపోవడంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.