Advertisement
Google Ads BL

ముందు నటన - తర్వాతే పెళ్లి


బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్నాళ్లుగా శిఖర్ ధావన్ తో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జరగడమే కాదు.. వారిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళడము, అలాగే తిరుపతి లో శ్రీవారి దర్శనానికి జంటగా వెళ్ళడము, పార్టీల్లో కలిసి కనిపించడం చూస్తున్నాము. త్వరలోనే జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా జాన్వీ కపూర్ ని బాలీవుడ్ మీడియా అదే ప్రశ్న వేసింది.. పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని.. ముందు సినిమాలు ఆతర్వాతే పెళ్లి అంటూ జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు జాన్వీ కపూర్ పదే పదే తిరుపతిలో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలను కనీ, అరిటాకులో భోజనం చేస్తూ తన భర్తను లుంగీలో చూడాలనే కోరిక ఉన్నట్లుగా చెప్పింది. 

అందుకే ఆమెను పెళ్లి గురించి కదిపితే.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటనపైనే ఉంది, పెళ్లి కి ఇంకా సమయముంది అని చెప్పుకొచ్చింది. ఈమధ్యనే పరం సుందరితో పరాభవం పొందిన జాన్వీ కపూర్.. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. 

Janhvi Kapoor breaks silence on her wedding:

 Janhvi Kapoor recently spilled details about her marriage plans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs