బిగ్ బాస్ సీజన్9 పై బయట బుల్లితెర ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ లేదు. ఓ రెండు రోజులు చూసాను పిచ్చ చిరాకొచ్చింది. కామనర్స్ ఏంట్రా బాబు అలా ఉన్నారు, ఆ సెలెబ్రిటీస్ ఎవర్రా అంటూ బయట ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన మొదటి వారంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది.
హౌస్ లో కామన్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ పైనే ఫైట్ చేస్తూ హోస్ట్ నాగార్జున తీరుని ఎండగడుతున్నారు. ఈవారం నాగార్జున ఇచ్చిన క్లాస్ తో హరీష్ ప్రస్తుతం హౌస్ లో ఫుడ్ తినకుండా నిరాహారదీక్ష చేస్తున్నాడు. బిగ్ బాస్ హరీష్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ప్రాబ్లెమ్ ఏమిటి అని అడిగారు. దానికి హరీష్ తన బాధ చెప్పుకున్నాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యువల్ లను కించపరిచేవిధంగా మాట్లాడిన హరిత హరీష్ ని ఈవారం హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేశారు.
సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారానికి గాను నామినేట్ అయినవారు మాస్క్ మ్యాన్ హరీశ్, భరణితో పాటు మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా హరిత హరీష్ ను హౌస్ టార్గెట్ చెయ్యగా ఆ తర్వాత భరణిని టార్గెట్ చేశారు. ఇక కామనర్స్ మధ్యన గొడవలు జరిగాయి. వాళ్లలో వాళ్ళే గొడవలు పడుతున్నారు.