కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టిన హరిత హరీష్ ని ఈ వారం నాగార్జున వీడియోస్ చూపించి మరీ పాయింట్ అవుట్ చెయ్యడం హరిత హరీష్ ని చాలా బాధపెట్టింది. తను చెయ్యలేదు అన్నా వీడియోస్ వేసి మరీ నాగార్జున హరిత హరీష్ తప్పు ను ఎత్తి చూపించడంతో హార్ట్ అయిన హరీష్ సండే ఎపిసోడ్ లో మొహం మాడ్చుకుని కూర్చున్నాడు.
ఇక ఈరోజు వదిలిన ప్రోమోలో హరీష్ రెండు రోజులుగా ఫుడ్ తీసుకోకపోవడంతో ప్రియా అతనికి ఫుడ్ పెట్టడానికి వచ్చి రెండు రోజులుగా ఏమి తినలేదు మీకు నీరసం వస్తుంది, అంటే నాకేమి వద్దు మీలాంటి వాళ్ళ మధ్యన నేను ఉండలేను, నన్ను పంపించేసేవరకు నేనేమి తినను అంటూ హరీష్ నిరాహారదీక్ష చేస్తున్నాడు.
మరి హరీష్ నిజంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే బిగ్ బాస్ పై ఫైట్ చేసి వెళ్లిపోవచ్చు కదా.. ఇలా ఏమి తినకుండా సాధించడం ఎందుకు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అందరూ సమానమే. హరీష్.. భరణి, ఇమ్మాన్యువల్, తనూజ విషయంలో మాట్లాడిన మాటలకు ఆడియన్స్ కి కోపమొచ్చింది. మరి అది హరీష్ కి ఎందుకు అర్ధమవడం లేదో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.