జగపతిబాబు హోస్ట్ గా జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా టాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ కే కింగ్ నాగార్జున గెస్ట్ గా రావడము, సెకండ్ ఎపిసోడ్ కి హీరో నాని.. ఇపుడు మూడో ఎపిసోడ్ కి మీనా, సిమ్రాన్, మహేశ్వరీ లు గెస్ట్ లుగా వచ్చి తమ పర్సనల్ విషయాలను, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ గురించిన విషయాలను ఈ జయమ్ము నిశ్చయమ్మురా లో పంచుకున్నారు. అయితే ఈ షో లో జగపతి బాబు మీనాకు సారీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. జగపతి బాబు-మీనా కొన్ని సినిమాలు కలిసి చేసారు. ఈ షో లో జగపతిబాబు మాట్లాడుతూ.. మీనా నీ హస్బెండ్ చనిపోయినప్పుడు నిన్ను కలవడానికి రాకపోవడానికి కారణం నీ మొహం చూసేందుకు నాకు ధైర్యం సరిపోలేదు అంటూ జగపతి బాబు మీనాకు సారీ చెప్పారు.
దానికి మీనా స్పందిస్తూ.. తన లైఫ్ లో అది అన్ ఎక్స్ పెక్టేడ్. తను చాలా బాధలో ఉన్న సమయంలో తన ఫ్రెండ్స్ అందరూ తనకు అండగా నిలిచారనీ, బాధపడుతూ ఇంట్లో కూర్చోవద్దని చెప్పి బయట ప్రపంచంలోకి తీసుకుని వచ్చారని చెప్పారు. కానీ సోషల్ మీడియా వలన తను చాలా ఎఫెక్ట్ అయ్యాను, నా హస్బెండ్ చనిపోయిన కొన్ని వారాలకే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని కొన్ని యూ ట్యూబ్ చానల్స్ రాసేయడం చాలా బాధ కలిగించింది.
సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టుగా మట్లాడారు. ఎవరో ఓ డివోర్స్ అయిన పర్సన్ ని నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా రాయడం ఎంత నీచం. వాళ్లకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి.. అంటూ మీనా ఎమోషనల్ అయితే అవును నేను పోయినట్లుగా రెండుసార్లు నా ఫోటోకి దండేసేసారు అంటూ జగపతిబాబు చెబుతూ.. అలాంటి విషయాలను పట్టించుకోవద్దని మీనాకి చెప్పారు.