ప్రస్తుతం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో అద్దిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న మిరాయ్ చిత్రం పై ప్రేక్షకులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లోను మిరాయ్ థియేటర్స్ కళకళలాడుతున్నాయి. అంటే మిరాయ్ కి మౌత్ టాక్ ఎంతగా వర్కౌట్ అయ్యిందో అర్ధమవుతుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి 60 కోట్ల బడ్జెట్ అయ్యింది. అంతకు మించి మిరాయ్ కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ హిట్ చిత్రానికి గాను తేజ సజ్జ కి 10 నుంచి 12 కోట్ల పారితోషికంగా, విలన్ గా నటించిన మంచు మనోజ్ కి 3 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట నిర్మాతలు. మంచు మనోజ్ భైరవమ్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చి.. మిరాయ్ తో మెరిపించాడు. విలన్ గా మంచు మనోజ్ పాత్ర మిరాయ్ లో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. అటు మిరాయ్ సక్సెస్ తో మనోజ్ ఎమోషనల్ అవుతున్నాడు.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసిన జగపతిబాబుకి రెండు కోట్లు, శ్రియాకి రెండు కోట్లు, హీరోయిన్ రితికా నాయక్‌కి మూడు కోట్లు తో పాటుగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ఐదు కోట్లు పారితోషికాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.