కంగువ, రెట్రో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో తెలుగులో 100 కోట్ల డైరెక్టర్, వరస సక్సెస్ లతో ఉన్న వెంకీ అట్లూరి తో సినిమాకి కమిట్ అవడమే కాదు ఆ సినిమా షూటింగ్ ని చకచకా ఫినిష్ చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ సితార బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
సూర్య-వెంకీ అట్లూరి కలయికలో తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయట. లక్కీ భాస్కర్ తో అటు థియేటర్స్ లో ఇటు నెట్ ఫ్లిక్స్ కి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ అట్లూరి నుంచి కోలీవుడ్ హీరో సూర్య తో చేస్తున్న మూవీ కోసం కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ సెట్ అయ్యింది అంటున్నారు.
అది సూర్య-వెంకీ మూవీకి 85 కోట్ల ఓటీటీ డీల్ కుదిరింది అనే వార్త సెన్సేషన్ అయ్యింది. మున్ముందు ఈ చిత్రం పై ఇంకెన్ని క్రేజీ వార్తలు వినిపిస్తాయో అంటూ సూర్య అభిమానులు మాట్లాడుకుంటున్నారు.